డిసెంబర్ ప్రత్యేక దర్శనం కోటాను విడుదల చేసిన టీటీడీ!

30-11-2020 Mon 12:25
  • రోజుకు 19 వేల టికెట్లు
  • ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 వరకూ స్లాట్లు
  • నిర్దేశిత సమయంలోనే రావాలన్న టీటీడీ
Tirumala Special Entrence Darshan Tickets Released by TTD

డిసెంబర్ నెలకు సంబంధించిన రూ. 300 ప్రత్యేక దర్శనం కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఉదయం విడుదల చేసింది. నిత్యమూ ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ పలు స్లాట్లలో రోజుకు 19 వేల టికెట్లను భక్తులకు జారీ చేయనున్నామని అధికారులు వెల్లడించారు.

 భక్తులంతా కరోనా నిబంధనలకు అనుగుణంగా నడచుకోవాలని, దర్శనాలు కూడా భౌతిక దూరం పాటిస్తూ చేసుకోవాలని అధికారులు వెల్లడించారు. ఆలయంలో నిత్యమూ శానిటైజేషన్ చేస్తున్నామని తెలిపింది. ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులు, ముందుగానే తిరుమలకు చేరుకుని, తమకు నిర్దేశించిన సమయంలో దర్శనం చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. వెబ్ సైట్ ద్వారా మాత్రమే ఈ టికెట్లను పొందాలని, మధ్యవర్తులను ఆశ్రయించి ఇబ్బందులు పడవద్దని పేర్కొంది.