Punjab farmers: కొనసాగుతున్న రైతుల ఆందోళన.. నడ్డా ఇంట్లో కేంద్రమంత్రుల సమావేశం

  • నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్
  • కొనసాగుతున్న రైతుల ‘చలో ఢిల్లీ’
  • రైతుల సమస్యపై చర్చ
union ministers met at jp nadda residence

కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. వాటిని రద్దు చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు. ముందస్తు చర్చలపై కేంద్ర ప్రతిపాదనను కూడా తిరస్కరించారు. ఈ నేపథ్యంలో రైతుల సమస్యలపై చర్చించేందుకు కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. బీజేపీ చీఫ్ నడ్డా నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్రసింగ్ తోమర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలపై చర్చించినట్టు తెలుస్తోంది.

More Telugu News