ముగిసిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం... బయటి వ్యక్తులు వెళ్లిపోవాలన్న ఎస్ఈసీ
- 15 రోజుల ప్రచారానికి నేటి సాయంత్రంతో తెర
- గడువు తర్వాత ప్రచారం చేస్తే జైలుశిక్ష
- డిసెంబరు 1న పోలింగ్
అభివృద్ధి, ఇటీవల వచ్చిన వరదలు, బాధితులకు సాయం, నాలా కబ్జాలు, ఆక్రమణలు వంటి అంశాలను ప్రచారాస్త్రాలుగా చేసుకుని ఆయా పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రచారం చేశాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్, ఎంఐఎంల మధ్య మైత్రి సాధ్యమయ్యే పరిస్థితులు లేకపోగా, దీన్ని బీజేపీ ఎలా సొమ్ము చేసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ డిసెంబరు 1న జరగనున్న సంగతి తెలిసిందే. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. డిసెంబరు 4న ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరగనుంది.