ఎయిర్ పోర్టులో జూనియర్ ఎన్టీఆర్ ఇలా...!

29-11-2020 Sun 18:05
  • దుబాయ్ వెళ్లొచ్చిన ఎన్టీఆర్
  • హైదరాబాద్ ఎయిర్ పోర్టులో క్లిక్ మన్న కెమెరాలు
  • స్టయిలిష్ లుక్స్ తో దర్శనమిచ్చిన తారక్
Junior NTR spotted at Hyderabad airport

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ లో నటిస్తున్నాడు. అయితే ఇటీవల దొరికిన విరామంలో ఎన్టీఆర్ దుబాయ్ విహారయాత్రకు వెళ్లాడు. ఫ్యామిలీతో కలిసి వెళ్లిన ఈ నందమూరి హీరో నిన్న హైదరాబాదు తిరిగొచ్చినట్టు తెలుస్తోంది. తారక్ ఎయిర్ పోర్టులో దర్శనమివ్వగా, ఆ పిక్స్ నెట్టింట సందడి చేస్తున్నాయి. లేత రంగు క్యాజువల్ దుస్తుల్లో స్టయిలిష్ గా ఉన్న జూనియర్ భుజానికి ఓ బ్యాగుతో నడుచుకుంటూ రావడం కెమెరా కళ్లకు చిక్కింది. ఫేస్ మాస్క్ తో ఉన్న ఎన్టీఆర్ ను ఎయిర్ పోర్టులో అభిమానులు వెంటనే గుర్తుపట్టేశారు.