అంతర్జాతీయ క్రికెట్లో 22 వేల పరుగులు పూర్తిచేసుకున్న కింగ్ కోహ్లీ

29-11-2020 Sun 17:10
  • ఆసీస్ తో రెండో వన్డేలో 89 పరుగులు చేసిన కోహ్లీ
  • అన్ని ఫార్మాట్లలో కలిపి అరుదైన రికార్డు
  • అత్యంత వేగంగా 22 వేల పరుగులు పూర్తి
Virat Kohli scripted another record

రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత చేరింది. అంతర్జాతీయ క్రికెట్లో వేగంగా 22,000 పరుగులు పూర్తిచేసుకున్న బ్యాట్స్ మన్ గా రికార్డు నెలకొల్పాడు.  ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరుగుతున్న రెండో వన్డేలో కోహ్లీ 89 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో అన్ని ఫార్మాట్లలో కలిపి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఓవరాల్ గా చూస్తే అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు సాధించిన మేటి బ్యాట్స్ మెన్ జాబితాలో కోహ్లీ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.

కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (34,357 రన్స్), కుమార్ సంగక్కర (28,016), రికీ పాంటింగ్ (27,483), మహేల జయవర్ధనే (25,957), జాక్వెస్ కలిస్ (25,534), రాహుల్ ద్రావిడ్ (24,208),  బ్రయాన్ లారా (22,358) ఉన్నారు.