అతని పెళ్లి సందర్భంగా చాలా బాధపడ్డాను: మంచు లక్ష్మి

29-11-2020 Sun 16:38
  • అమీర్ ఖాన్ పై క్రష్ ఉండేదన్న మంచు లక్ష్మి
  • వీలైతే పెళ్లి చేసుకోవాలని అనుకున్నట్టు వెల్లడి
  • తన ప్రేమ తనలోనే ఉండిపోయిందంటూ వ్యాఖ్యలు 
Manchu Lakshmi reveals her crush on Amir Khan

టాలీవుడ్ సెలబ్రిటీ మంచు లక్ష్మి అనేక విభాగాల్లో తన సత్తా నిరూపించుకుంటూ ఉమెన్ పవర్ చాటుతున్నారు. సినిమాలు, టాక్ షోలు, ప్రొడక్షన్... ఇలా బహుముఖ ప్రజ్ఞ ప్రదర్శిస్తున్నారు. యూట్యూబ్ రంగంలోనూ సందడి చేస్తున్న మోహన్ బాబు తనయ తాజాగా ఆసక్తికర అంశాలు వెల్లడించారు. తనకు బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ అంటే విపరీతమైన క్రష్ అని తెలిపారు. బాలీవుడ్ 'మిస్టర్ పర్ఫెక్ట్' ను ఎంతో ఇష్టపడేదాన్నని, కుదిరితే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా ఉండేదని వెల్లడించారు.

కానీ తన ప్రేమ తనలోనే ఉండిపోయిందని, అతనితో చెప్పలేకపోయానని వాపోయారు. అమీర్ ఖాన్ కు రెండు పెళ్లిళ్లు జరగ్గా, ఆ రెండుసార్లు చాలా బాధపడ్డానని తెలిపారు. వెక్కి వెక్కి ఏడ్చానని నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. మంచు లక్ష్మి ఇండో-అమెరికన్ వ్యాపారవేత్త ఆండీ శ్రీనివాస్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.