తెలుగు బిగ్ బాస్ షోలో కిచ్చ సుదీప్ సందడి

29-11-2020 Sun 15:47
  • నేడు సండే ఎపిసోడ్
  • స్పెషల్ గెస్ట్ గా కిచ్చ సుదీప్
  • కంటెస్టెంట్లతో సుదీప్ వినోదం
Kannada actor Sudeep makes fun at Telugu Bigg Boss show

తెలుగు బిగ్ బాస్ షో సండే ఎపిసోడ్ లో ప్రముఖ నటుడు కిచ్చ సుదీప్ విచ్చేశారు. మొదట సోలోగా ఎంట్రీ ఇచ్చిన సుదీప్ బిగ్ బాస్ ఇంటి సభ్యులను ఆసక్తికర ప్రశ్న అడిగారు. కంటెస్టెంట్లు తనను విసిగించేస్తున్నారని హోస్ట్ నాగార్జున ఇంటికి వెళ్లిపోయారని, ఆయన ఈ షోకి ఎందుకు రావాలి అంటూ ఒక్కో కంటెస్టెంట్ ను సుదీప్ ప్రశ్నించారు. దాంతో ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో రకంగా సమాధానమిచ్చారు.

మేం అందరం నాగ్ సర్ ను లవ్ చేస్తున్నాం అంటూ దేత్తడి హారిక బదులివ్వగా, నాగ్ సర్ ను ఆయన కుటుంబం అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తోందని కిచ్చ సుదీప్ స్పష్టం చేశారు. ఇక అభిజీత్ మాట్లాడుతూ నాగ్ సర్ కింగ్ అని, నాగ్ సర్ బెస్ట్ అని చెప్పడంతో, తాను కూడా అందుకు అంగీకరిస్తానని సుదీప్ పేర్కొన్నారు. అనంతరం నాగ్ కు వెల్కమ్ చెప్పడంతో బిగ్ బాస్ వేదికపై మళ్లీ కొత్త కాంతి వచ్చింది. ఇంటి సభ్యుల ముఖాలు వెలిగిపోయాయి.