రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు... కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు

29-11-2020 Sun 15:06
  • అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు సర్వం సిద్ధం
  • 1,637 మంది పోలీసులతో బందోబస్తు
  • సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా
AP assembly sessions will start tomorrow

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి వెలగపూడిలో జరగనున్నాయి. శాసనసభ సమావేశాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. 1,637 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ బందోబస్తులో పాలుపంచుకుంటున్నారు. భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ విశాల్ గున్నీ మాట్లాడుతూ, నలుగురు ఏఎస్పీలు, 20 మంది డీఎస్పీలు, 58 మంది సీఐలు, 9 మంది ఆర్ఐలకు బందోబస్తు బాధ్యతలు అప్పగించినట్టు వెల్లడించారు. గరుడ కంట్రోల్ సెంటర్ నుంచి బందోబస్తు బాధ్యతల పర్యవేక్షణ నిర్వహిస్తామని చెప్పారు. ఐటీ కోర్ టీమ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ పరిసరాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్లతో నిఘా ఉంటుందని తెలిపారు.