హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా.. నేరుగా భాగ్యలక్ష్మి ఆలయానికి పయనం.. భారీ బందోబస్తు

29-11-2020 Sun 11:51
  • బేగంపేట విమానాశ్రయంలో షాకు బీజేపీ నేతల స్వాగతం
  • భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న షా
  • హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్ షో
amitshah to reach charminar

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు జోరుగా ప్రచారంలో పాల్గొంటున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు బీజేపీ తెలంగాణ నేతలు స్వాగతం పలికారు. అక్కడి నుంచి బీజేపీ నేతలతో కలిసి అమిత్ షా నేరుగా చార్మినార్‌లోని భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లనున్నారు.

అమ్మవారిని దర్శించుకుని ఆయన పూజల్లో పాల్గొననున్నారు. దీంతో పోలీసులు అక్కడ భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవారికి పూజలు చేసిన అనంతరం అమిత్ షా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రోడ్ షోలో పాల్గొని బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ రోజు సాయంత్రం ఆయన తిరిగి ఢిల్లీకి వెళతారు.