Telangana: తెలంగాణ ఉద్యమంలో ఇదో అపురూప ఘట్టం: దీక్షా దివస్‌ సందర్భంగా కేటీఆర్ ట్వీట్

ten years completed for kcr deeksha divas
  • 29 నవంబరు 2009లో కేసీఆర్ ఆమరణ దీక్ష
  • తెలంగాణ ప్రజలకు కేటీఆర్ శుభాకాంక్షలు
  • తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ దీక్ష మలుపుతిప్పిందన్న మంత్రి
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టి నేటికి పదకొండేళ్లు పూర్తయ్యాయి. ఈ అపురూప ఘట్టాన్ని గుర్తు చేసుకున్న మంత్రి కేటీఆర్ తెలంగాణ ప్రజలకు ‘దీక్షా దివస్’ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష తెలంగాణ ప్రజలను ఏకం చేసిందని, తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిందని అన్నారు.

ఈ మేరకు ట్విట్టర్ ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్ 29 నవంబరు 2009న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో దిగి వచ్చిన కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించింది. కేసీఆర్ ఆమరణ దీక్ష సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం నవంబరు 29న దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహిస్తున్నారు.
Telangana
KCR
deeksha divas
KTR

More Telugu News