ఉండవల్లి గారు చక్కగా చెప్పారు: ఐవైఆర్

28-11-2020 Sat 21:42
  • బూతులు తిట్టినా ప్రెస్ మీట్ పెడతానన్న ఉండవల్లి
  • టీడీపీ, వైసీపీ వాళ్లు పిచ్చి భ్రమలో ఉన్నారన్న ఐవైఆర్
  • సంస్కార హీనులు, పనికిమాలిన ప్రభుత్వాలు అంటూ వ్యాఖ్యలు
IYR Krishana Rao responds to Undavalli press meet

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. అయితే, తన విమర్శలు నచ్చని పార్టీ వాళ్లు నీకు ఇంకా కరోనా రాలేదా, నువ్వు ఇంకా పోలేదా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారని, తనను బూతులు తిట్టినా ప్రెస్ మీట్ పెడతానని ఉండవల్లి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ నేత, మాజీ ఐఏఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు స్పందించారు.

ఉండవల్లి గారు చక్కగా బదులిచ్చారని ప్రశంసించారు.ఆ రోజుల్లో తెలుగుదేశం సోషల్ మీడియా, ఈ రోజుల్లో వైసీపీ సోషల్ మీడియా... బూతులతో దాడి చేస్తే మాట్లాడడం మానేస్తామని పిచ్చి భ్రమలో ఉన్నారని విమర్శించారు. అలాంటి సంస్కార హీనులకు సరైన సమాధానం అంటే రెట్టింపు మోతాదులో ఈ పనికిమాలిన ప్రభుత్వాలను ప్రశ్నించడమేనని ఐవైఆర్ అభిప్రాయపడ్డారు.