Ram Gopal Varma: లాక్ డౌన్ తర్వాత విడుదలవుతున్న మొట్టమొదటి సినిమా ఇదే: వర్మ

Ram Gopal Varma tweets on Corona Virus film release
  • కరోనా వైరస్ పేరిట చిత్రాన్ని తెరకెక్కించిన వర్మ
  • డిసెంబరు 11న విడుదల
  • రియల్ లైఫ్ హారర్ చిత్రం అంటూ వర్మ ట్వీట్
కాకలుతీరిన ఫిలింమేకర్లు సైతం విస్మయానికి గురయ్యేలా ఎంతో అవలీలగా సినిమాలు తెరకెక్కించడం దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రత్యేకత. సినిమా ప్రకటించిన కొన్నివారాలకే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. తన సినిమాలకు వర్మ ఎలా ప్రచారం చేసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కోవలో తెరకెక్కిందే కరోనా వైరస్ అనే చిత్రం. ప్రస్తుత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని తీసిన ఈ చిత్రం డిసెంబరు 11న విడుదల కానుంది. దీనిపై వర్మ స్పందిస్తూ, కరోనా లాక్ డౌన్ తర్వాత థియేటర్లలో ప్రదర్శితం కానున్న మొట్టమొదటి చిత్రం కరోనా వైరస్ అని వెల్లడించారు. ఇది రియల్ లైఫ్ హారర్ చిత్రం అని తెలిపారు. ఈ చిత్రానికి వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వం వహించాడు.
Ram Gopal Varma
Corona Virus
Movie
Release
Theaters
Lockdown

More Telugu News