నాకు తెలుగు భాష వచ్చు కానీ, మీ భాష రాదు: నాగబాబుకు కౌంటర్ ఇచ్చిన ప్రకాశ్ రాజ్

28-11-2020 Sat 20:40
  • పవన్ బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని విమర్శించిన ప్రకాశ్ రాజ్
  • ప్రకాశ్ రాజ్ పై ధ్వజమెత్తిన నాగబాబు
  • గౌరవనీయులైన నాగబాబు గారికి అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్
Prakash Raj replies to Nagababu

పవన్ కల్యాణ్ పై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యల పట్ల నాగబాబు ఘాటైన పదజాలంతో విరుచుకుపడడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. గౌరవనీయులైన నాగబాబు గారికి అంటూ ట్వీట్ చేశారు. "మీ తమ్ముడి మీద ఉన్న ప్రేమ నాకు అర్థమైంది. నాకు దేశం మీద ఉన్న ప్రేమని మీరు అర్థం చేసుకోండి. నాకు తెలుగు భాష వచ్చు కానీ మీ భాష రాదు" అంటూ చురకలంటించారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటూ పవన్ కల్యాణ్ బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని ప్రకాశ్ రాజ్ విమర్శించడం, ఆపై నాగబాబు వ్యాఖ్యలు చేయడం మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ప్రముఖంగా దర్శనమిస్తోంది.