జీనోమ్ వ్యాలీని సందర్శించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు: చంద్రబాబు

28-11-2020 Sat 17:31
  • హైదరాబాదు వచ్చిన ప్రధాని మోదీ
  • భారత్ బయోటెక్ సందర్శన
  • ప్రధాని పర్యటన ఎంతో ఊతమిస్తుందన్న చంద్రబాబు
 Chandrababu thanked PM Narendra Modi for his visit of Bharat Biotech in Hyderabad genome valley

ప్రధాని నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం హైదరాబాదు జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ పరిశోధన కేంద్రాన్ని సందర్శించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.జీనోమ్ వ్యాలీని సందర్శించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఐసీఎంఆర్ సహకారంతో భారత్ బయోటెక్ కొనసాగిస్తున్న కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్ పరిశోధనలు మరింత ముందుకు వెళ్లేందుకు ప్రధాని మోదీ సందర్శన ఊతమిస్తుందని అభిప్రాయపడ్డారు. శాస్త్రీయ పర్యావరణ వ్యవస్థ వృద్ధి చెందాల్సిన అవసరాన్ని కరోనా మహమ్మారి వ్యాప్తి ఎత్తిచూపుతోందని చంద్రబాబు తెలిపారు.

ఈ నేపథ్యంలో జీనోమ్ వ్యాలీ నిర్మాణంలో పాలుపంచుకున్న భాగస్వాములు, అధికారులు, శాస్త్రవేత్తలకు ఎంతో రుణపడి ఉన్నామని వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు తన ట్వీట్ కు 'ఆత్మనిర్భర్ భారత్' హ్యాష్ టాగ్ కూడా పెట్టారు.