రాజాసింగ్ రోడ్ షోలో ఉద్రిక్తత

28-11-2020 Sat 16:46
  • బాలాజీ నగర్ లో రోడ్ షో నిర్వహించిన రాజాసింగ్
  • ఎదురుగా వచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు
  • పోటాపోటీ నినాదాలతో వేడెక్కిన ప్రచారం
Tension in Raja Singh road show

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ నిర్వహించిన రోడ్ షోలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బాలాజీనగర్ డివిజన్ లో రోడ్ షో కొనసాగుతున్న సమయంలో టీఆర్ఎస్ శ్రేణులు ఎదురుగా వచ్చాయి. బీజేపీ నేతలు వెనక్కి వెళ్లిపోవాలని నినాదాలు చేశాయి.

దీంతో, టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు కూడా నినాదాలు చేశారు. దీంతో, అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోటాపోటీ నినాదాలతో ఆ ప్రాంతం వేడెక్కింది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. అనంతరం రెండు పార్టీల నాయకులు ఎవరి ప్రచారాన్ని వారు చేసుకుంటూ ముందుకు సాగారు.