గ్రేటర్ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుంది: బండి సంజయ్

28-11-2020 Sat 16:13
  • పాతబస్తీలో తప్పకుండా సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తాం
  • రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయి
  • బీజేపీ అధికార పీఠంపై కూర్చుంటుంది
TRS govt will collapse after GHMC elections says Bandi Sanjay

పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో సెగలు రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర నుంచి ఆ పార్టీ నేతలంతా తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఈరోజు బండి సంజయ్ మాట్లాడుతూ మరోసారి అవే వ్యాఖ్యలు చేశారు. పాతబస్తీలో తప్పకుండా సర్జికల్ స్ట్రయిక్స్ చేస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోతుందని అన్నారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు తప్పకుండా వస్తాయని.. బీజేపీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుందని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రతి డివిజన్ కు కేసీఆర్ రూ. 5 కోట్ల చొప్పున పంపారని ఆరోపించారు. వరద సాయం కోసం ఇచ్చిన రూ. 500 కోట్లు టీఆర్ఎస్ కార్యకర్తల జేబుల్లోకి వెళ్లాయని చెప్పారు.