KTR: మీరు కూల్చితే మేం కడతాం... అదే మా పని: కేటీఆర్

TRS Working President KTR met business people in Hyderabad
  • జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్
  • వివిధ వర్గాలతో సమావేశం
  • బీజేపీ, ఎంఐఎంలకు కూల్చడమే పనా? అంటూ వ్యాఖ్యలు
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రచారంతో పాటు వివిధ వర్గాల ప్రతినిధులను కలుస్తూ బలమైన మద్దతు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ మ్యారీ గోల్డ్ లో గుజరాతీ, మార్వాడీ, అగర్వాల్, మహేశ్వరి వ్యాపార ప్రముఖులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గల్లీ స్థాయి ఎన్నికల కోసం ఢిల్లీ స్థాయి నేతలు తరలి వస్తున్నారని ఎద్దేవా చేశారు. స్థానిక సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు.

ఇటీవల పలు పార్టీలకు చెందిన నేతలు ఆక్రమణలు, కూల్చివేతలు అని వ్యాఖ్యలు చేస్తుండడంపైనా ఈ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఘాటుగా స్పందించారు. కూల్చడమే బీజేపీ, ఎంఐఎం పనా? అని విమర్శించారు. మీ పని కూల్చడం అయితే, కట్టడం మా పని అని స్పష్టం చేశారు.

నగరంలో రోడ్ల కోసం మూడంచెల ప్రణాళికతో ముందుకెళుతున్నామని వివరించారు. హైదరాబాదులో ఎక్కడ చూసినా ఫ్లైఓవర్లు, అండర్ పాస్ లు కడుతున్నామని వెల్లడించారు. ప్రధాన రోడ్లపై రద్దీ తగ్గించేందుకు లింక్ రోడ్లు వేస్తున్నామని చెప్పారు. ఐదారేళ్లలో డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేస్తామని చెప్పారు. 100 ఏళ్లలో ఎన్నడూ రానంత వర్షం ఇటీవల కురిసిందని కేటీఆర్ తెలిపారు. ఊహించని వర్షం వస్తే అన్ని నగరాల్లో వరద వస్తుందని అన్నారు.
KTR
TRS
BJP
MIM
GHMC Elections

More Telugu News