Parliament: తైవాన్‌ పార్లమెంటులో ప్రభుత్వ నేతలపై పంది మాంసం విసిరిన ప్రతిపక్ష సభ్యులు.. వీడియో ఇదిగో

  • పంది మాంసం దిగుమతికి తైవాన్ ప్రభుత్వం ప్రయత్నాలు
  • అమెరికాతో ఒప్పందంపై పార్లమెంటులో చర్చ
  • మండిపడ్డ ప్రతిపక్ష నేతలు
Pig guts fly as Taiwan lawmakers fight in parliament

తైవాన్‌ పార్లమెంటులో నిన్న విచిత్రమైన వాతావరణం కనిపించింది. ప్రభుత్వంపై ఆగ్రహం చెందిన ప్రతిపక్ష నేతలు పంది అవయవాలు, మాంసాన్ని అధికార పార్టీ నాయకులపై విసిరారు. చైనా దుందుడుకు చర్యలను వ్యతిరేకిస్తోన్న తైవాన్ ఇటీవల అగ్రరాజ్యం అమెరికాతో సత్సంబంధాలను మరింత బలపర్చుకున్న విషయం తెలిసిందే. దీంతో తైవాన్ ప్రభుత్వం అమెరికాతో వాణిజ్య బంధం ఏర్పరచుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది.

ఇందులో భాగంగా అమెరికా నుంచి పంది మాంసాన్ని దిగుమతి చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకోవడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తైవాన్‌లో పోర్క్‌పై గత కొన్నేళ్లుగా నిషేధం ఉండగా, దీనిని ఎత్తివేస్తూ ఆగస్టులో అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి అమల్లోకి వచ్చేలా విధానాలు రూపొందించే పనిలో ఉంది.

ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టగా, నిరసన తెలుపుతూ పార్లమెంటులోకి పంది అవయాలు, మాంసాన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు తీసుకొచ్చారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ పంది మాంసాన్ని అధికార పార్టీ సభ్యులపైకి విసిరారు. దీంతో అధికార పార్టీ సభ్యులు కూడా ప్రతిపక్ష నేతలపై విరుచుకుపడ్డారు.

దీంతో పంది మాంసం, బీఫ్‌ దిగుమతి విషయంలో విధానాల రూపకల్పన గురించిన చర్చ ముందుకు సాగలేదు. సహనం కోల్పోయిన డీపీపీ నేత ప్రతిపక్ష నేతపై పార్లమెంటులోనే చేయిచేసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత తైవాన్ ప్రభుత్వ నేతలు అమెరికా పోర్క్‌ను వ్యతిరేకించారని, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం మద్దతు తెలుపుతున్నారని ప్రతిపక్షనేతలు విమర్శించారు.    



More Telugu News