Narendra Modi: పీపీఈ కిట్ ధరించి.. కరోనా వ్యాక్సిన్ ల్యాబ్‌ను పరిశీలించిన ప్రధాని మోదీ.. వీడియో ఇదిగో

modi wear ppe kit
  • గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో  'జైకోవ్‌-డి' ప్రయోగాల పరిశీలన
  • రెండో దశ ప్రయోగాల గురించి శాస్త్రవేత్తలతో చర్చ
  • మోదీని చూసేందుకు భారీగా వచ్చిన ప్రజలు
కొవిడ్-19 వ్యాక్సిన్‌ అభివృద్ధిపై సమీక్షించేందుకు ప్రధాని మోదీ ఈ రోజు మూడు నగరాల పర్యటనను ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదట ఆయన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ చేరుకుని, అక్కడి నుంచి జైడస్‌ క్యాడిలా పార్కుకు చేరుకున్నారు. ఆ సంస్థ అభివృద్ధి చేస్తున్న 'జైకోవ్‌-డి' టీకా ప్రయోగాలను మోదీ పరిశీలించారు.

ఆ వ్యాక్సిన్‌ రెండో దశ ప్రయోగాల గురించి శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పీపీఈ కిట్ ధరించి అక్కడి శాస్త్రవేత్తలతో కలిసి ల్యాబ్‌లను పరిశీలించారు. అలాగే, ఆ సంస్థ ప్రమోటర్లతో పాటు ఎగ్జిక్యూటివ్‌లతో మోదీ మాట్లాడారు. మోదీని చూసేందుకు జైడస్‌ బయోటెక్‌ పార్క్‌ వద్దకు స్థానిక ప్రజలు భారీగా తరలిరావడంతో వారికి మోదీ అభివాదం చేశారు. అహ్మదాబాద్‌ పర్యటన అనంతరం ఆయన హైదరాబాద్ వచ్చి భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న 'కొవాగ్జిన్' వ్యాక్సిన్  పరిశీలించనున్నారు.
Narendra Modi
ppe kit
Corona Virus
COVID19

More Telugu News