Suneel: మరోసారి వస్తున్న 'మర్యాద రామన్న' జోడి!

Maryada Ramanna pair coming again
  • రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 'మర్యాద రామన్న'
  • హీరో హీరోయిన్లుగా నటించిన సునీల్, సలోని
  • తాజాగా వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో మరోసారి    
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో పదేళ్ల క్రితం వచ్చిన 'మర్యాద రామన్న' సినిమా అప్పట్లో అందర్నీ ఆకట్టుకుంది. హాస్యనటుడు సునీల్ కథానాయకుడుగా ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టాడు. ఆయన సరసన సలోని కథానాయికగా నటించింది. ఈ జంట ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ వీరిద్దరూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో ప్రస్తుతం ఓ చిత్రం రూపొందుతోంది. ఎటువంటి అధికారిక ప్రకటన .. ప్రచారం లేకుండా కామ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో సునీల్ కథానాయకుడుగా నటిస్తున్నాడు. అతని సరసన సలోని హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ గత కొంత కాలంగా హైదరాబాదులో జరుగుతోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని తెలుస్తోంది.

ఇదిలావుంచితే, ఇటీవల 'డిస్కో రాజా', 'కలర్ ఫొటో' సినిమాలలో విలన్ గా కూడా నటించి మెప్పించిన సునీల్.. ఓపక్క హీరోగా నటిస్తూనే మరోపక్క హాస్య పాత్రలు, విలన్ పాత్రలు కూడా చేస్తున్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో కూడ సునీల్ విలన్ గా నటిస్తున్నట్టు చెబుతున్నారు.
Suneel
Saloni
Rajamouli
VN Aditya

More Telugu News