Anasuya: 'థాంక్యూ బ్రదర్' నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సాయితేజ్... కృతజ్ఞతలు తెలిపిన అనసూయ

Anasuya thanked Saitej for the release of Thank You Brother first look poster
  • అనసూయ కొత్త చిత్రం 'థాంక్యూ బ్రదర్'
  • ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సాయితేజ్
  • ప్రియ అండ్ అభి తరఫున థ్యాంక్స్ అంటూ అనసూయ ట్వీట్
అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'థాంక్యూ బ్రదర్'. ఈ సినిమాతో రమేశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను మెగా హీరో సాయితేజ్ విడుదల చేశారు. ఇందులో 'ప్రియ'గా అనసూయ నటిస్తుండగా, అశ్విన్ విరాజ్ 'అభి' పాత్ర పోషిస్తున్నాడు. కాగా, తమ చిత్ర ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడంపై హీరో సాయితేజ్ కు అనసూయ కృతజ్ఞతలు తెలిపారు. 'థాంక్యూ బ్రదర్' చిత్రంలోని 'ప్రియ అండ్ అభి' తరఫున ధన్యవాదాలు అంటూ అనసూయ ట్వీట్ చేశారు. కాగా, తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ లో అనసూయ గర్భంతో కనిపిస్తుండడంతో 'థాంక్యూ బ్రదర్' సినిమాపై ఆసక్తి రేకెత్తిస్తోంది.
Anasuya
Saitej
Thank You Brother
First Look
Tollywood

More Telugu News