ఏపీ కరోనా అప్ డేట్: 733 పాజిటివ్ కేసులు, 6 మరణాలు

27-11-2020 Fri 21:20
  • గడచిన 24 గంటల్లో 57,752 కరోనా పరీక్షలు
  • అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 118 కేసులు
  • ప్రకాశం జిల్లాలో 13 మందికి కరోనా పాజిటివ్
corona virus spreading update

ఏపీలో గడచిన 24 గంటల్లో 57,752 కరోనా పరీక్షలు నిర్వహించగా, 733 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా పశ్చిమ గోదావరిలో 118 కేసులు రాగా, గుంటూరు జిల్లాలో 112, కృష్ణా జిల్లాలో 102 కేసులు వచ్చాయి.

అత్యల్పంగా ప్రకాశం జిల్లాలో 13 కేసులు గుర్తించారు. కర్నూలు జిల్లాలో 21, శ్రీకాకుళం జిల్లాలో 22, విజయనగరం జిల్లాలో 31, కడప జిల్లాలో 33 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 1,205 మంది కరోనా నుంచి కోలుకోగా, ఆరుగురు మరణించారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో 8,66,438 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 8,47,325 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 12,137 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తం మరణాల సంఖ్య 6,976కి చేరింది.