Rat: విషసర్పం నోట చిక్కిన బిడ్డ కోసం ఓ తల్లి వీరోచిత పోరాటం... వీడియో ఇదిగో!

 Rat fights with snake for mouse
  • తన చిట్టెలుక కోసం ప్రాణాలకు తెగించిన తల్లి ఎలుక
  • ఎలుకను వదిలి పారిపోయిన పాము
  • వీడియో వైరల్
ఒకరిది ఆకలి... మరొకరిది కన్నబిడ్డ కోసం పోరాటం! కడుపు నింపుకోవాలన్న ఉద్దేశంతో ఓ పాము ఎలుక పిల్లను తినేందుకు ప్రయత్నించగా, తల్లి ఎలుక ప్రాణాలకు తెగించి పాముతో పోరాడి తన చిట్టెలుకను కాపాడుకుంది. ఎలుక పిల్లను నోట కరుచుకుని వెళుతున్న విషసర్పాన్ని ఎలుక ఎదిరించిన తీరు మాతృత్వ స్ఫూర్తిని చాటుతుంది. ఎలుక దాడితో హడలిపోయిన పాము చివరికి పిల్ల ఎలుకను వదిలేసి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి జారుకుంది. దీని తాలూకు వీడియోను ఓ అటవీశాఖ అధికారి సోషల్ మీడియాలో పంచుకోగా, నెటిజన్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
Rat
Mouse
Snake
Viral Videos

More Telugu News