బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ రోడ్ షోలో ఘర్షణ

27-11-2020 Fri 14:04
  • టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
  • రాజాసింగ్ వాహనం వద్ద కార్యకర్తల పోటాపోటీ నినాదాలు
  • కార్యకర్తలను సముదాయించిన ఆయా పార్టీల నాయకులు
ruckus in rajasingh road show

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి గడువు ముగియనున్న నేపథ్యంలో పోటీలో ఉన్న అన్ని పార్టీల నేతలు జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో  కూకట్ పల్లిలో ఈ రోజు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రోడ్ షోలో పాల్గొనగా అక్కడ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

రోడ్ షోలో పాల్గొంటోన్న రాజాసింగ్ వాహనం వద్ద బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలను ఆయా పార్టీల నాయకులు సముదాయించారు. దీంతో రాజాసింగ్ తన వాహనంలో రోడ్ షోను కొనసాగిస్తున్నారు.