సినీనటుడు సుదీప్ పోస్ట్ చేసిన ఫొటో చూసి ఆశ్చర్యపోతోన్న నెటిజన్లు!

27-11-2020 Fri 13:34
  • కండలు పెంచిన హీరో
  • మంచి ఆహారం, జీవ‌న శైలి,  జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేసి సిక్స్ ప్యాక్
  • 'ఫాంథ‌మ్' క‌న్న‌డ సినిమా కోసం కష్టపడుతోన్న సుదీప్
sudeep shares a pic

దర్శకుడు రాజమౌళి తీసిన ‘ఈగ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కిచ్చ సుదీప్.. తాజాగా కండలు పెంచి ఫొటో తీసుకుని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మంచి ఆహారం, జీవ‌న శైలి,  జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేసి ఇలా మారిపోయానంటూ సుదీప్ తన ట్వీట్ లో తెలిపాడు. ఆయన శరీర ఆకృతిని చూస్తోన్న నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

హీరోగా కన్నడలోనూ ఆయన స్టార్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఫాంథ‌మ్ అనే క‌న్న‌డ సినిమాలో నటిస్తున్నాడు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో ఆగిపోయిన సినిమా షూటింగులు తిరిగి కొన్ని రోజుల క్రితం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుదీప్ 'పాంథమ్' సినిమా కోసం కండలు పెంచాడు. ఈ సినిమా చివరి షెడ్యూల్  డిసెంబ‌ర్ 4న ప్రారంభం కానుంది. ఇందులో సుదీప్‌పై కీల‌క స‌న్నివేశాలను  చిత్రీక‌రిస్తారు.