భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా.. ఫించ్ సెంచరీ

27-11-2020 Fri 12:34
  • 101 పరుగుల చేసిన ఫించ్
  • 57 పరుగులతో ఆడుతున్న స్మిత్
  • వికెట్ తీసిన షమీ
Finch scores century against India

ఇండియాతో సిడ్నీలో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు చెలరేగిపోతున్నారు. భారత బాలర్లు ఇప్పటి వరకు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయిన ఈ మ్యాచ్ లో ఆసీస్ భారీ స్కోరు దిశగా దూసుకుపోతోంది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 76 బంతుల్లో 69 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఆ తర్వాత మరో ఓపెనర్ ఫించ్ కు స్మిత్ జతకలిశాడు. స్మిత్ క్రీజులోకి వచ్చిన తర్వాత ఆసీస్ వేగం మరింత పెరిగింది. ఈ క్రమంలో ఫించ్ సెంచరీ చేశాడు. 117 బంతులను ఎదుర్కొన్న ఫించ్ సెంచరీ (101 రన్స్) పూర్తి చేశాడు. మరోవైపు స్మిత్ దూకుడుగా ఆడుతూ హాఫ్ సెంచరీ (57) పూర్తి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 38.4 ఓవర్లలో ఒక్క వికెట్ నష్టానికి 245 పరుగులు.  భారత బౌలర్లలో షమీ ఒక వికెట్ పడగొట్టాడు.