స్వామిగౌడ్ కు ఏం జరిగిందో ఆయనే చెప్పాలి: శ్రీనివాస్ గౌడ్

27-11-2020 Fri 12:03
  • టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరిన స్వామిగౌడ్
  • టీఆర్ఎస్ ను ఎవరూ ఏమీ చేయలేరన్న శ్రీనివాస్ గౌడ్
  • మరో 20 ఏళ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని వ్యాఖ్య
Swamy Goud has to tell what happened to him says Srinivas Goud

శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్ టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యమకారులను కేసీఆర్ పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ ఎవరినీ కలవరని ఆరోపించారు. ఆత్మాభిమానం చంపుకోలేకే పార్టీని వీడానని చెప్పారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.

స్వామిగౌడ్ కు ఏం జరిగిందో ఆయనే చెప్పాలని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అన్ని కులాలు, అన్ని వర్గాలను ముఖ్యమంత్రి సమానంగా ఆదరించారని చెప్పారు. కేసీఆర్ హయాంలో అందరికీ న్యాయం జరిగిందని అన్నారు. టీఆర్ఎస్ ను ఎవరూ ఏమీ చేయలేరని... మరో 15 నుంచి 20 సంవత్సరాల వరకు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని అన్నారు.