'ఆర్ఆర్ఆర్'లో భాగం కానున్న చిరంజీవి?

27-11-2020 Fri 11:03
  • తారక్, చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం
  • పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్
  • రాజమౌళి అడగ్గానే ఒప్పుకున్న మెగాస్టార్
Chiranjeevi to take part in RRR movie

ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చిరంజీవి కూడా భాగం కానున్నారనేదే ఆ వార్త. అయితే, తెరపై కనిపించకుండానే ప్రేక్షకులను చిరంజీవి అలరించబోతున్నారు. ఈ సినిమాలో తారక్, రాంచరణ్ పాత్రలను పరిచయం చేస్తూ చిరంజీవి వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారట.

దీనికి సంబంధించి రాజమౌళి ఫోన్ చేయగానే చిరంజీవి రెండో ఆలోచన చేయకుండానే ఓకే చెప్పేశారట. మరోవైపు హిందీ వర్షన్ లో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అజయ్ దేవగణ్, శ్రియ, అలియా భట్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు.