Rajasthan: అత్తింటి ఆరళ్లకు తాళలేక నిప్పంటించుకున్న భార్య.. వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపిన భర్త

wife set ablaze Husband took video in Rajasthan
  • రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ఘటన
  • బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి 
  • భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసిన పోలీసులు
అత్తింటి వారు పెడుతున్న బాధలు తట్టుకోలేని ఓ వివాహిత ఒంటికి నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు యత్నించగా, కాపాడాల్సిన భర్త.. ఆమె మంటల్లో సజీవ దహనం అవుతుంటే తీరిగ్గా తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి కుటుంబ సభ్యులకు పంపించాడు. రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో ఈ నెల 20న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. అత్తింటి వేధింపులతో మనస్తాపానికి గురైన వివాహిత శరీరానికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు యత్నించింది. అయితే, మంటలు శరీరాన్ని దహిస్తుంటే భరించలేకపోయిన ఆమె కేకలు వేస్తుంటే అక్కడే ఉన్న భర్త ఆమెను రక్షించాల్సింది పోయి, తీరిగ్గా తన సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను తన కుటుంబ సభ్యులకు పంపించాడు. కాగా, తీవ్రంగా గాయపడిన బాధితురాలు జైపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 22న మృతి చెందింది. నిన్న ఆమె భర్త, అత్తమామలపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Rajasthan
woman
ablaze
Crime News

More Telugu News