ప్రశ్నోత్తరాల సమయం లేకుండా ప్రభుత్వం తప్పించుకునేందుకు యత్నిస్తోంది: మండలి ఛైర్మన్ కు టీడీపీ లేఖ

27-11-2020 Fri 09:54
  • త్వరలో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు
  • ప్రజా సమస్యలపై చర్చించేందుకు ప్రశ్నోత్తరాలు ఉండాలన్న టీడీపీ ఎమ్మెల్సీలు
  • ప్రశ్నోత్తరాలకు సమయం ఇవ్వాలని విన్నపం
TDP MLAs writes letter to Legislative Council Chairman

ఏపీ అసెంబ్లీ సమావేశాలు త్వరలో ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో శాసనమండలి ఛైర్మన్ కు టీడీపీ శాసనమండలి సభ్యులు లేఖ రాశారు. సభ్యుల హక్కులను  కాలరాసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని... సభ్యుల హక్కులను కాపాడాలని లేఖలో కోరారు. సభ సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కరోనా పేరుతో ప్రశ్నోత్తరాల సమయం లేకుండా తప్పించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ప్రజల సమస్యలపై చర్చించేందుకు ప్రశ్నోత్తరాల సమయం ఉండాలని పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాలకు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు టీడీపీ మండలి సభ్యులు బుద్దా వెంకన్న, అశోక్ బాబు, మంతెన వెంకట సత్యనారాయణరాజు తదితరులు ఛైర్మన్ కు లేఖ రాశారు.