తెలంగాణలో కొత్తగా 761 కరోనా కేసులు.. నలుగురి మృతి

27-11-2020 Fri 09:35
  • 2,67,665కి పెరిగిన కేసుల సంఖ్య
  • ప్రస్తుతం రాష్ట్రంలో 10,839 యాక్టివ్ కేసులు
  • ఇప్పటి వరకు 1,448 మంది మృతి
761 new Corona cases registered in Telangana

తెలంగాణలో కొత్తగా 761 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 42,242 మందికి కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,67,665కి చేరింది. నిన్న నలుగురు వ్యక్తులు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఈ ఉదయం తాజా బులెటిన్ ను విడుదల చేసింది. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,448కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,839 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 53,32,150 కోవిడ్ పరీక్షలను నిర్వహించారు.