టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా!

27-11-2020 Fri 09:02
  • బ్యాటింగ్ కు మంచి వికెట్ అన్న ఫించ్
  • నిలదొక్కుకుంటే మంచి స్కోర్ వస్తుందని వెల్లడి
  • ఈ మ్యాచ్ తమకు చాలా ముఖ్యమన్న కోహ్లీ
Australia Won toss and Elected to bat

ఇండియాతో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా, తొలుత బ్యాటింగ్ ను ఎంచుకుంది. టాస్ గెలిచిన ఆరోన్ ఫించ్, ఇది బ్యాటింగ్ చేసే వారికి మంచి వికెట్ అని, కాస్తంత నిలదొక్కుకుంటే మంచి స్కోర్ ను సాధించే అవకాశాలు ఉన్నాయని అన్నాడు. తమ టీమ్ లో మిచెల్ మార్ష్ బదులు స్టీవ్ స్మిత్ ను జట్టులోకి తీసుకున్నామని చెప్పాడు.  

ఆపై విరాట్ కోహ్లీ మాట్లాడుతూ, ఈ మ్యాచ్ తమ టీమ్ కు చాలా ముఖ్యమని, ఆటగాళ్లంతా పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించే సమయం ఆసన్నమైందని, కలసికట్టుగా ఆడతామని అన్నారు. తొలి మ్యాచ్ లో విజయం సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నామని, చాలా రోజుల తరువాత ఓ అంతర్జాతీయ మ్యాచ్ ఆడటం ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపుతుందని అన్నాడు.

ఇండియా జట్టు: విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, నవదీప్ సైనీ, జస్ ప్రీత్ బుమ్రా, యుజువేంద్ర చాహల్

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, మార్నస్, స్టోయినిస్, గ్లెన్ మాక్స్ వెల్, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజల్ వుడ్.