అభిమానుల సందడితో కళకళలాడుతున్న సిడ్నీ క్రికెట్ స్టేడియం!

27-11-2020 Fri 08:24
  • నేడు ఆస్ట్రేలియాతో భారత్ క్రికెట్ మ్యాచ్
  • 50 శాతం ప్రేక్షకులకు అనుమతి
  • చాలాకాలం తరువాత మైదానంలో కనిపించిన అభిమానులు
Fans in Sydney Cricket Ground

ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ అభిమానులతో కళకళలాడుతోంది. కరోనా తరువాత ఆగిపోయిన క్రికెట్ మ్యాచ్ లు, ఆపై ప్రేక్షకులు లేకుండా జరగడం ప్రారంభం కాగా, ఇప్పుడు మొత్తం స్డేడియం కెపాసిటీలో 50 శాతానికి మించకుండా ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఎస్సీజీలో చాలా కాలం తరువాత క్రికెట్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఇటీవల ఇక్కడ న్యూజిలాండ్ తో ఆస్ట్రేలియా ఓ మ్యాచ్ ని ఆడగా, దానికి ప్రేక్షకులను అనుమతించలేదు. భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మూడు వన్డే మ్యాచ్ లు ఆడనున్న సంగతి తెలిసిందే.