Rohingyas: అగర్తలా-న్యూఢిల్లీ రైలులో ప్రయాణిస్తున్న 14 మంది రోహింగ్యాల అరెస్ట్

  • బంగ్లాదేశ్ నుంచి దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలు
  • ఫారిన్ అమెండ్ మెండ్ యాక్ట్ కింద అరెస్ట్
  • జ్యుడీషియల్ కస్టడీకి తరలింపు 
14 Rohingyas arrested

రోహింగ్యాల వల్ల దేశ భద్రతకు పెను ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. మన దేశంలోకి అక్రమంగా చొరబడిన వీరు అనేక ప్రాంతాల్లో సెటిలైపోయారు. వీరిని ఏరిపారేయాలనే డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో సైతం రోహింగ్యాల ప్రస్తావన వచ్చిన సంగతి తెలిపిందే.

మరోవైపు బంగ్లాదేశ్ నుంచి మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన 14 మంది రోహింగ్యాలను అరెస్ట్ చేశారు. వీరు... అగర్తలా-న్యూఢిల్లీ స్పెషల్ రాజధాని ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తుండగా రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధాని ఎక్స్ ప్రెస్ లో రోహింగ్యాలు ప్రయాణిస్తున్నారనే స్పష్టమైన సమాచారం అలిపుర్దౌర్ సెక్యూరిటీ కంట్రోల్ కు అందింది. ఈ నేపథ్యంలో న్యూ జల్పాయ్ గురి రైల్వేస్టేషన్ లో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం రైల్వే పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో ఆసక్తికర విషయాలు తెలిశాయి. వీరంతా తప్పుడు పేర్లతో రైల్లో ప్రయాణిస్తున్నారని తేలింది. బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్ లో ఉన్న శరణార్థుల శిబిరం నుంచి పారిపోయి భారత్ లోకి వీరు అక్రమంగా ప్రవేశించారు. వీరిని ఫారిన్ అమెండ్ మెండ్ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన పోలీసులు మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం వీరందరినీ జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీచేశారు. 

More Telugu News