Tirumala: తుపాను ప్రభావంతో విరిగిపడుతున్న బండరాళ్లు.. తిరుమల శ్రీవారి మెట్టు మార్గం మూసివేత

cyclone nivar effect srivari stairway closed temporarily
  • తిరుమలలో రెండు రోజులుగా భారీ వర్షాలు
  • పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కేపీడ్యామ్ గేట్లను ఎత్తిన అధికారులు
  • అన్నవరం సత్యదేవుని తెప్పోత్సవానికి ఆటంకం
నివర్ తుపాను ప్రభావంతో తిరుమలలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో శ్రీవారి మెట్టు నడక మార్గంలో బండరాళ్లు విరిగి పడుతుండడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ఆ మార్గాన్ని తాత్కాలికంగా మూసివేశారు. భారీ వర్షాల కారణంగా తిరుమలలో జలాశయాలు నీటితో నిండిపోయాయి.

పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కేపీ డ్యామ్ గేట్లను ఎత్తిన అధికారులు నీటిని  కిందికి విడుదల చేస్తున్నారు. పాపవినాశనం, ఎంబీసీ ప్రాంతంలో చెట్లు విరిగిపడ్డాయి. మొదటి ఘాట్ రోడ్డులో 54వ మలుపు వద్ద భారీ వృక్షం విరిగిపడడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. కుమారధార, పసుపుధార, ఆకాశగంగ డ్యామ్‌లు పూర్తిగా నిండి పొంగిపొర్లుతున్నాయి. తిరుమల మాడవీధుల్లోను, శ్రీవారి ఆలయం ఎదుట వరద పారింది. కాగా, శ్రీవారి మెట్టు మార్గాన్ని తాత్కాలికంగా మూసివేసిన అధికారులు.. భక్తులను తిరిగి ఎప్పుడు అనుమతించేదీ తెలియజేస్తామన్నారు.

మరోవైపు, తుపాను కారణంగా అన్నవరం సత్యదేవుని తెప్పోత్సవాన్ని అధికారులు నిలిపివేశారు. క్షీరాబ్ది ద్వాదశి సందర్భంగా రాత్రి 7 గంటలకు జరగాల్సిన తెప్పోత్సవాన్ని నిర్వహించలేకపోయారు.  
Tirumala
Tirupati
TTD
stair way
Nivar cyclone

More Telugu News