సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

27-11-2020 Fri 07:24
  • దక్షిణాదికి దూరం కానంటున్న తాప్సి 
  • నాని సినిమాలో ముగ్గురు నాయికలు
  • 'జార్జిరెడ్డి' హీరో రొమాంటిక్ సినిమా  
Tapsi says she will not be away to South cinema

*  హిందీలో చేస్తున్నంత మాత్రాన దక్షిణాది సినిమాలను వదలనని అంటోంది కథానాయిక తాప్సి. 'దక్షిణాది సినిమాలకి దూరమవ్వాలనే ఉద్దేశం నాకు లేదు. అందుకే, హిందీ సినిమాలు చేస్తూనే దక్షిణాదివి కూడా చేస్తున్నాను. ఒక పరిశ్రమ కోసం మరో పరిశ్రమతో రాజీ పడాల్సిన పనిలేదు. మంచి అవకాశాలు వస్తే కనుక తప్పకుండా తెలుగు, తమిళ సినిమాలు చేస్తాను' అని చెప్పింది.
*  నేచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో 'శ్యామ్ సింగ రాయ్' పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. ఇందులో ఇప్పటికే సాయిపల్లవి, కృతి శెట్టిలను కథానాయికలుగా ఎంపిక చేశారు. మూడో కథానాయిక పాత్ర కూడా ఉండడంతో ఆ పాత్రకు అదితిరావు హైదరి, నివేద థామస్ లను పరిశీలిస్తున్నారట. త్వరలో వీరిద్దరిలో ఒకరిని ఎంపిక చేస్తారని తెలుస్తోంది.
*  'వంగవీటి', 'జార్జిరెడ్డి' చిత్రాల హీరో సందీప్ మాధవ్ తాజాగా మరో చిత్రానికి సంతకం చేశాడు. నూతన దర్శకుడు మధు కిరణ్ దర్శకత్వం వహించే ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది.