Joe Biden: ఇద్దరికీ లాభముండేలా పనిచేద్దాం: బైడెన్ ను ఉద్దేశించి జిన్ పింగ్

Jin Ping Congratulate Biden
  • అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్
  • చైనా కంపెనీలతో స్నేహపూర్వకంగా బైడెన్ ఉంటారని అంచనా
  • బైడెన్ కు శుభాభినందనలు తెలిపిన జిన్ పింగ్
చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, అమెరికాకు తదుపరి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న జో బైడెన్ కు శుభాభినందనలు తెలిపారు. బైడెన్ నేతృత్వంలో ఇరు దేశాల మధ్యా సత్సంబంధాలు కొనసాగుతాయని, పరస్పరం లాభపడేలా నిర్ణయాలు తీసుకోవడంలో బైడెన్ చొరవ చూపిస్తారని భావిస్తున్నామని జిన్ పింగ్ వ్యాఖ్యానించారు.

వాణిజ్య విధానంలో ఉన్న అపోహలు తొలగి, సాంకేతిక, రక్షణ రంగాల్లోనూ సహాయ సహకారాలు అందిపుచ్చుకోవాల్సి వుందని అభిప్రాయపడ్డారు. చైనా, అమెరికా మధ్య సంబంధాలు కనిష్ఠ స్థాయులకు పడిపోయిన నేపథ్యంలో జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

చైనాతో పాటు ఉత్తర కొరియాతోనూ బలమైన సంబంధాలను బైడెన్ తిరిగి నిలుపుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్న సంగతి తెలిసిందే. వాతావరణ మార్పులు, కరోనా వైరస్ తదితరాల విషయంలో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను ఇప్పటికే బైడెన్ తోసిపుచ్చారు. చైనాతో వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించడంతో పాటు ఆ దేశపు కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు విధించారు. అయితే, బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తరువాత యూఎస్ విధానాలు మారతాయని, వాణిజ్యం విషయంలో చైనా కంపెనీలతో ఆయన స్నేహపూర్వకంగా వ్యవహరిస్తారని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Joe Biden
jinping
USA
India
Trade

More Telugu News