Pele: గగనాన నీతో ఫుట్ బాల్ ఆడతానని ఆశిస్తున్నా: దిగ్గజ క్రీడాకారుడు పీలే నివాళులు

Pele Mourms Maradona Death
  • తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చిన పీలే
  • ఓ గొప్ప స్నేహితుడిని కోల్పోయాను
  • ఇన్ స్టాగ్రామ్ లో పీలే వ్యాఖ్యలు
తన సహచర దిగ్గజ ఆటగాడు డీగో మారడోనా మరణంపై బ్రెజిల్ ఫుట్ బాల్ పితామహుడు పీలే తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. "ఏదో ఒకరోజు గగన వీధిలో నీతో కలిసి ఫుట్ బాల్ ఆడతాననే అనుకుంటున్నాను. ఓ గొప్ప స్నేహితుడిని నేను కోల్పోయాను. ఇది చాలా దుర్వార్త. ఈ ప్రపంచం ఓ దిగ్గజ క్రీడాకారుడిని కోల్పోయింది" అని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పీలే పేర్కొన్నారు.

తన పోస్టుకు 1986లో అర్జెంటీనా వరల్డ్ కప్ ను గెలుచుకున్న చిత్రాన్ని ఆయన జోడించారు. "ఈ సమయంలో నాకు ఎంతో మాట్లాడాలని ఉంది. కానీ మాటలు రావడం లేదు. మారడోనా కుటుంబానికి భగవంతుడు శక్తిని ప్రసాదించాలని వేడుకుంటున్నాను" అని కూడా పీలే పేర్కొన్నారు.

ఫుట్ బాల్ ప్రపంచంలో పీలే, మారడోనాలు ఎంతో గొప్ప పేరు సంపాదించుకున్నారు. గత నెలలో పీలే 80వ జన్మదినాన్ని, మారడోనా 60వ జన్మదినాన్ని జరుపుకోవడం విశేషం.  
Pele
Maradona
Football
Instagram

More Telugu News