Chiranjeevi: చిరంజీవి సినిమాలో కథానాయిక ఉండదా?

  • 'ఆచార్య' తర్వాత చిరంజీవి రెండు రీమేక్స్ 
  • 'లూసిఫర్'కి మోహన్ రాజా దర్శకత్వం
  • 'లూసిఫర్' మాతృకలో లేని నాయిక పాత్ర
  • తెలుగులో కూడా నాయిక పాత్ర లేనట్టే!  
No heroine role in Chiranjeevis movie

తెలుగు సినిమా అంటేనే హీరోయిన్ గ్లామర్ నిండి ఉంటుంది. అందులోనూ స్టార్ హీరోల సినిమాలంటే మరీనూ. ఒకరే కాకుండా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు కూడా వుంటారు. అంతగా హై డోస్ గ్లామర్ ని వదులుతారు మనవాళ్లు. ఇక చిరంజీవి సినిమా అంటే చెప్పేక్కర్లేదు. పాటలు.. డ్యాన్సులు.. గ్లామర్ విరజిమ్ముతుంది. అందుకే, ఆయన సినిమాకి స్టార్ స్టేటస్ వున్న హీరోయిన్లను బుక్ చేస్తూవుంటారు. అయితే, ఇప్పుడు హీరోయిన్ లేకుండా చిరంజీవి ఓ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం 'ఆచార్య' సినిమాలో నటిస్తున్న చిరంజీవి దీని తర్వాత 'వేదాళం', 'లూసిఫర్' రీమేక్స్ చేయనున్నారు. ఇందులో మలయాళ సినిమా 'లూసిఫర్'కి తమిళ యువ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వం వహించనున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. ఈ సినిమా మాతృకలో హీరో పాత్ర సరసన హీరోయిన్ ఉండదు.

అయితే, తెలుగుకి వచ్చేటప్పటికి హీరోయిన్ పాత్రను క్రియేట్ చేద్దామని మొదట అనుకున్నారట. తీరా ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకుని, మాతృకకు పెద్దగా మార్పులు చేయడం లేదని తెలుస్తోంది. ఈ కారణంగా చిరంజీవి సరసన కథానాయిక ఎవరూ ఉండరని అంటున్నారు. అందుకే, ఈ చిత్రం మెగాస్టార్ కెరీర్లో వెరైటీ అవుతుందనే చెప్పాలి!

More Telugu News