ఢిల్లీ నుంచి హైదరాబాదుకు వరదలాగా దిగుతున్న కేంద్రమంత్రులందరికీ స్వాగతం: కేటీఆర్

25-11-2020 Wed 18:38
  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కేంద్రమంత్రుల ప్రచారం
  • వరదల సమయంలో వస్తే బాగుండేదన్న కేటీఆర్
  • వరద సాయం తీసుకువస్తారని ఆశిస్తున్నా అంటూ ట్వీట్
KTR welcomes Union Ministers to Hyderabad in a satirical way

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారం కోసం ఆ పార్టీ అగ్రనేతలు, కేంద్రమంత్రులు హైదరాబాదుకు వస్తుండడంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యం ప్రదర్శించారు. హైదరాబాదుకు వరదలాగా ఢిల్లీ నుంచి దిగుతున్న కేంద్రమంత్రులందరికీ స్వాగతం అని వ్యాఖ్యానించారు. నగరం అకాల వర్షాలతో, వరదలతో తల్లడిల్లుతున్నప్పుడు సాంత్వన చేకూర్చడానికి వీళ్లు వచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేంద్రమంత్రులు ఉత్త చేతులతో రాకుండా, సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేసిన విధంగా నగర ప్రజలకు వరద సాయంగా రూ.1,350 కోట్లు తీసుకువస్తారని ఆశిస్తున్నా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.