Adinarayana Reddy: ఆంధ్ర, రాయలసీమ ప్రజలంతా బీజేపీకి ఓటు వేయాలి: మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి

AP leader Adinarayana Reddy requests Andhra and Rayalaseema people to vote for BJP
  • దేశానికి హైదరాబాద్ రెండో రాజధాని కాబోతోంది
  • హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం
  • కేంద్ర నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోంది
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. హైదరాబాదులో పెద్ద సంఖ్యలో ఏపీ ప్రజలు ఉండటంతో... ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఈ ఎన్నికలపై పెద్ద ఎత్తున చర్చ జరుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని అయ్యే అవకాశం ఉందని చెప్పారు.

గ్రేటర్ హైదరాబాద్ ను గ్రేట్ గా మార్చే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని ఆదినారాయణరెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రజలంతా బీజేపీకే ఓటు వేయాలని కోరారు. టీఆర్ఎస్ నేతలు ఇచ్చే నోట్లను తీసుకుని... బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పారు. తెలంగాణ కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను టీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటోందని ఆరోపించారు. మరోవైపు గ్రేటర్ లో బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
Adinarayana Reddy
BJP
Andhra Pradesh
GHMC Elections
Hyderabad

More Telugu News