జనవరి నుంచి 'వకీల్ సాబ్'కి వస్తానంటున్న శ్రుతిహాసన్!

25-11-2020 Wed 16:28
  • కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాలలో శ్రుతి 
  • తెలుగులో 'క్రాక్', 'వకీల్ సాబ్' సినిమాలు
  • పవన్ తో మూడవ సినిమా అంటున్న నాయిక  
Shruti Hassan will join Vakeel Saab shoot in January

అందాలతార శ్రుతి హాసన్ నటన నుంచి ఆమధ్య కొన్నాళ్లు గ్యాప్ తీసుకుని, మళ్లీ ఇటీవలే కథానాయికగా బిజీ అవుతోంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కొత్తగా సినిమాలు ఒప్పుకుంటోంది. ఈ క్రమంలో ఇప్పటికే తెలుగులో రవితేజ సరసన 'క్రాక్' సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ కూడా పూర్తయింది.

ఇక తాను తెలుగులో నటిస్తున్న మరో చిత్రం పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న 'వకీల్ సాబ్'. ఈ చిత్రం షూటింగులో ఈ ముద్దుగుమ్మ ఇంతవరకు జాయిన్ కాలేదు. వచ్చే జనవరి నుంచి ఈ చిత్రం సెట్స్ లో అడుగుపెడతానని అమ్మడు చెప్పింది. తాజాగా ఇన్ స్టాలో అభిమానులతో ముచ్చటిస్తూ శ్రుతి ఈ విషయాన్ని చెప్పింది.

"పవన్ కల్యాణ్ తో మరో సినిమా చేస్తున్నందుకు హ్యాపీగా వుంది. అందులోనూ ఆయన చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న వకీల్ సాబ్ లో నటిస్తుండడం ఇంకా హ్యాపీగా వుంది. ఇక ఈ చిత్రం షూటింగులో జనవరి నుంచి పాల్గొంటాను. పవన్ కల్యాణ్ తో ఇది నా మూడవ సినిమా" అంటూ శ్రుతి ఆనందంగా చెప్పింది.