ప్రాఫిట్ బుకింగ్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

25-11-2020 Wed 15:59
  • 694 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 196 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 6 శాతానికి పైగా లాభపడ్డ ఓఎన్జీసీ
Sensex closes 694 points low

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కు మొగ్గు చూపడంతో మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 694 పాయింట్లు కోల్పోయి 43,828కి పడిపోయింది. నిఫ్టీ 196 పాయింట్లు నష్టపోయి 12,858కి దిగజారింది. టెలికాం, రియాల్టీ, బ్యాంకెక్స్, హెల్త్ కేర్ సూచీలు ఎక్కువగా నష్టపోయాయి.

ఓఎన్జీసీ (6.25%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (0.33%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.10%)లు సెన్సెక్స్ లో గెయినర్లుగా నిలిచాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్ (-3.22%), యాక్సిస్ బ్యాంక్ (-3.16%), సన్ ఫార్మా (-2.61%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.50%), బజాజ్ ఫైనాన్స్ (-2.49%)లు టాప్ లూజర్లుగా నిలిచాయి.