అల్లు అర్జున్ 'పుష్ప'లో మరో ప్రముఖ హీరో?

25-11-2020 Wed 14:34
  • ఎర్రచంద్రనం స్మగ్లింగ్ నేపథ్యంలో బన్నీ 'పుష్ప'
  • కథానాయికగా రష్మిక.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం   
  • ప్రాజక్టు నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి
  • తాజాగా తమిళ హీరో విక్రమ్ తో సంప్రదింపులు
Another hero to play key role in Pushpa

'అల వైకుంఠపురములో' చిత్రం తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం 'పుష్ప'. ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. కాగా, ఈ చిత్రంలో హీరో పాత్ర కాకుండా మరో కీలక పాత్ర ఒకటి వుంది. దీని కోసం మొదట్లో తమిళ నటుడు విజయ్ సేతుపతిని అనుకోవడం.. తర్వాత ఆయన ప్రాజక్టు నుంచి తప్పుకోవడం జరిగింది.

ఆ తర్వాత ఈ పాత్రకు ఉపేంద్ర, సుదీప్ వంటి ప్రముఖ నటుల పేర్లు వినిపించాయి. ఈ క్రమంలో తాజాగా తమిళ కథానాయకుడు విక్రమ్ పేరు తెరపైకి వచ్చింది. విభిన్న పాత్రలు పోషిస్తూ విలక్షణ నటుడిగా పేరుతెచ్చుకున్న విక్రమ్ అయితే, ఈ పాత్రకు మరింత స్టేచర్ కూడా వస్తుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం ఆయనతో సంప్రదింపులు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ వార్తలో వాస్తవం ఎంతుందనేది త్వరలో తెలుస్తుంది.

ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రను పోషిస్తున్నాడు. ఆయన సరసన రష్మిక కథానాయికగా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు.