Devineni Uma: ప్రశాంత విశాఖలో వైసీపీ పడగతో భూముల కబ్జా, కంపెనీల స్వాధీనం: దేవినేని ఉమ

  • వాల్తేర్ క్లబ్, కార్తీకవనం, బేపార్క్, ప్రేమ సమాజం ఆస్తుల స్వాహా
  • రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాల ధ్వంసం
  • సెలవు రోజుల్లో అర్ధరాత్రి కదులుతున్న ప్రొక్లైన్లు
  • శని,ఆదివారాలు కూడా కోర్టులు ఉండాలంటున్న ప్రజలు
devineni uma slams jagan

వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దందా మొదలైందని, రూ.10 కోట్లు ఇస్తే  భూమి భద్రంగా ఉంటుందని లేదంటే ఇబ్బందులు తప్పవని అప్పట్లోనే విశాఖకు చెందిన ఒక వ్యక్తిని బెదిరించారని ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ కథనాన్ని పోస్ట్ చేస్తూ టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఇలా దందా చేసుకుంటూ వస్తూనే ఉన్నారని చెప్పారు.

అలాగే, ఇటీవల వరుసగా టీడీపీ నేతలను, వారి సానుభుతిపరులను లక్ష్యంగా చేసుకుని కూల్చివేతలు సాగుతున్నాయని, ఇందులో చిన్నా పెద్దా తేడా లేదని ఆంధ్రజ్యోతిలో పేర్కొన్నారు. నోటీసులు ఇవ్వకుండా, న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశం కూడా లేకుండా సెలవు రోజుల్లో, అర్ధరాత్రి దాటాక కట్టడాలను కూల్చివేసే అరాచక సంస్కృతికి తెరలేపారని అందులో ఇచ్చారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ వైసీపీపై దేవినేని ఉమ విమర్శలు గుప్పించారు.

‘ప్రశాంత విశాఖలో వైసీపీ పడగతో భూముల కబ్జా, కంపెనీల స్వాధీనం. వాల్తేర్ క్లబ్, కార్తీకవనం, బేపార్క్, ప్రేమ సమాజం ఆస్తుల స్వాహా. రాజకీయ ప్రత్యర్థుల ఆర్థిక మూలాల ధ్వంసం. సెలవు రోజుల్లో అర్ధరాత్రి కదులుతున్న ప్రొక్లైన్లు. శని,ఆదివారాలు కూడా కోర్టులు ఉండాలంటున్న ప్రజల డిమాండ్ వినబడుతుందా? వైఎస్ జగన్?’ అని దేవినేని ఉమ నిలదీశారు.

More Telugu News