మరి, మీరు నమ్మేదెవరిని? అసలు మిమ్ములను ఎందుకు ప్రజలు నమ్మాలి?: వర్ల రామయ్య ఎద్దేవా

25-11-2020 Wed 12:16
  • ముఖ్యమంత్రి గారూ.. మీరెందుకు వ్యవస్థలను నమ్మడం లేదు?
  • న్యాయ వ్యవస్థను నమ్మరు, ఎన్నికల కమిషన్ ను నమ్మరు
  • రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదంటారు
  • కేంద్రంతో కుదరదంటారు
varla slams jagan

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు టీడీపీ నేత వర్ల రామయ్య చురకలు అంటించారు. జగన్ ఎవరినీ నమ్మరని, అన్ని వ్యవస్థల మీదా నమ్మకం లేదని అంటుంటారని వర్ల రామయ్య అన్నారు. అలాంటప్పుడు ప్రజలు ఆయనను ఎందుకు నమ్మాలని వర్ల రామయ్య ప్రశ్నించారు.

‘ముఖ్యమంత్రి గారూ! మీరెందుకు వ్యవస్థలను నమ్మడం లేదు? న్యాయ వ్యవస్థను నమ్మరు, ఎన్నికల కమిషన్ ను నమ్మరు, రాష్ట్ర పోలీసుల మీద నమ్మకం లేదంటారు, కేంద్రంతో కుదరదంటారు, మరి, మీరు నమ్మేదెవరిని? అసలు, ఇన్ని, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మిమ్ములను ఎందుకు ప్రజలు నమ్మాలి? గ్రహచారం కాకపోతే!’ అని వర్ల రామయ్య ఎద్దేవా చేశారు.