తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ తో ప్రేమలో పడిన ఆమిర్ ఖాన్ కూతురు ఐరా

25-11-2020 Wed 10:31
  • నుపూర్‌ షీఖరేతో ప్రేమాయణం 
  • గతంలో మిషాల్‌ అనే వ్యక్తితో ప్రేమ
  • మిషాల్‌తో బ్రేకప్
aira pics go viral
సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండే బాలీవుడ్‌  హీరో ఆమిర్ ‌ఖాన్‌ కూతురు ఐరా ఖాన్ తన ప్రియుడితో దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ‌ తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ నుపూర్‌ షీఖరేతో ఆమె ప్రేమలో ఉన్నట్లు పలు జాతీయ పత్రికల్లో వార్తలు వస్తున్నాయి.

ఐరా ఖాన్ గతంలో కూడా మరొకరితో ప్రేమాయణం కొనసాగించింది. మిషాల్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్న సమయంలో ఆయనపై ప్రేమను ఒలకబోస్తూ ఆమె సోషల్‌ మీడియాలో పోస్టులు చేసేది. కొన్ని రోజుల క్రితం వారిద్దరు విడిపోయారు. ఈ క్రమంలో ఇప్పుడు ట్రైనర్‌ నుపూర్‌ షీఖరేతో ఆమె ప్రేమలో పడింది.  

గత కొన్నేళ్లుగా ఆమిర్‌కు నుపూర్ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌గా ఉన్నాడు. కొన్ని నెలల‌ నుంచి ఐరాకు కూడా ఆయన కోచ్‌గా మారాడు. ఈ సమయంలోనే వారిద్దరు ప్రేమలో పడ్డారు. నుపూర్‌ వ్యక్తిత్వం బాగా నచ్చడంతో ఐరా ఆయనను ప్రేమిస్తోందని వార్తలు వస్తున్నాయి. కొన్నినెలలుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది.

తమ ప్రేమ వ్యవహారం గురించి ఐరా ఇప్పటికే తన తల్లికి చెప్పింది. ఐరా తల్లి కూడా వారిద్దరి ప్రేమకు అంగీకారం తెలిపింది. ఈ నేపథ్యంలో సంబరపడిపోతూ ఈ జంట ఇటీవల ఆమిర్‌ ఖాన్ కు చెందిన ఓ‌ ఫామ్‌హౌస్‌లో స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంది. పార్టీలో వీరు తీసుకున్న ఫొటోలు బయటకు వచ్చాయి.