Monolith: అమెరికా ఎడారిలో ప్రత్యక్షమైన లోహపు దిమ్మె... ఎక్కడ్నించి వచ్చింది?

  • ఉటా రెడ్ రాక్ ఎడారిలో స్టెయిన్ లెస్ స్టీల్ దిమ్మె
  • హెలికాప్టర్ సర్వేలో దర్శనమిచ్చిన వైనం
  • ఎలా వచ్చిందో తెలియక అధికారుల విస్మయం
A Monolith appears in Utah desert

అమెరికాలోని ఉటా ఎడారిలో ఇటీవల ఓ లోహపు దిమ్మె దర్శనమిచ్చింది. నిర్జన రెడ్ రాక్ ఎడారిలో ఆ లోహపు దిమ్మె ఎక్కడ్నించి వచ్చిందన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. ఉటా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతంలో ధగధగ మెరిసిపోతున్న ఆ లోహపు దిమ్మె కనిపించడం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఆగ్నేయ ఉటాలో పొట్టేళ్ల కోసం హెలికాప్టర్ సర్వే నిర్వహిస్తుండగా ఈ దిమ్మె దర్శనమిచ్చింది.

దాంతో కిందికి దిగిన ప్రభుత్వ సిబ్బంది దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయారు. ముక్కోణాకృతిలో ఉన్న స్టెయిన్ లెస్ స్టీల్ వస్తువుగా దానిని గుర్తించారు. దాన్ని అక్కడికి ఎవరైనా తీసుకువచ్చారా అంటే అందుకు తగ్గ ఆనవాళ్లు అక్కడేమీ లేవు. దాంతో వారు మరింత విస్మయానికి గురయ్యారు. ప్రస్తుతం దీనిపై ప్రభుత్వ అధికారులు విచారణ చేస్తున్నారు.

More Telugu News