Strike: గురువారం నాడు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపు!

  • పిలుపునిచ్చిన 10 కార్మిక సంఘాలు
  • చట్టాలను తుంగలో తొక్కుతున్న కేంద్రం
  • 25 కోట్ల మంది పాల్గొంటారన్న సంఘాలు
Nationwide Strike on Thursday

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా గురువారం నాడు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు 10 కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. సులభతర వాణిజ్యానికి అవకాశాలంటూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతోందని, ఫలితంగా కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపిస్తున్న ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ సహా 10 సంఘాలు ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా బ్యాంకులు, రైల్వేలు, రక్షణ రంగంతో పాటు వివిధ రంగాలకు చెందిన దాదాపు 25 కోట్ల మందిఈ సమ్మెలో పాల్గొంటారని కార్మిక సంఘాలు వెల్లడించాయి.

More Telugu News