ధోనీ మార్గదర్శి దేవల్ సహాయ్ కన్నుమూత
- కెరీర్ తొలినాళ్లలో సీసీఎల్ కు ప్రాతినిధ్యం వహించిన ధోనీ
- సీసీఎల్ డైరెక్టర్ గా వ్యవహరించిన సహాయ్
- ధోనీ కోసం టర్ఫ్ పిచ్ లు ఏర్పాటుచేసిన వైనం
దేవల్ సహాయ్ పాత్ర 'ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్ స్టోరీ' బయోపిక్ లోనూ కనిపిస్తుంది. దేవల్ సహాయ్ గతంలో సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్) డైరెక్టరుగా పనిచేశారు. ధోనీ కెరీర్ ప్రారంభ దశలో కోల్ ఫీల్డ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ధోనీలోని ప్రతిభను పసిగట్టిన ఆయన వెన్నుతట్టి ప్రోత్సహించారు. అప్పటివరకు ఉన్న పిచ్ లకు భిన్నంగా ధోనీ కోసం ప్రత్యేకంగా టర్ఫ్ (పచ్చికతో కూడిన) పిచ్ లు అందుబాటులోకి తెచ్చారు. ఓ రకంగా ధోనీ ఎదుగుదలలో సహాయ్ పాత్ర కూడా కీలకం అని చెప్పాలి. ధోనీ కూడా అనేక సందర్భాల్లో ఆయనను ప్రస్తావించారు.